Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తవారి ఇంటిముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది..

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:01 IST)
అత్తవారి ఇంటిముందే ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. క్షణికావేశంలో తనకు తాను సజీవ దహనం చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లిలో ఈ ఘటన జరిగింది. హరిప్రసాద్‌రెడ్డికి రెండేళ్ల క్రితం పుదుచ్చేరికి చెందిన సత్యవాణితో ప్రేమ వివాహం జరిగింది. బెంగళూరులో కాపురం ఉంటున్న దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయి. 
 
నిన్నటి అర్ధరాత్రి భర్త స్వగ్రామం మునిపల్లికి వచ్చిన భార్య సత్యవాణి భర్త ఇంట్లో లేకపోవటంతో అత్త మామలతో తన భర్తను ఇంటికి పిలిపించాలని సత్యవాణి కోరింది. తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న భర్త హరి ప్రసాద్, అత్త మామల ముందే భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని భార్య సత్యవాణి నిప్పంటించుకుంది. ఈ ఘటనతో సత్యవాణి అక్కడికక్కడే సజీవదహనం అయింది. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు గాయలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం పవన్ కల్యాణ్, డిప్యూటీ సీఎం లోకేష్, కూటమి చైర్మన్ చంద్రబాబు: కలలు కంటున్న తమ్మారెడ్డి

బ్యాచ్‌లర్స్ జీవితంలో స్ట్రగుల్స్ ను మజాకా చేసుకుంటున్న సందీప్ కిషన్

Akira Nandan: అకీరా నందన్‌తో కలిసి పనిచేసేందుకు రెడీ.. విష్ణు వర్ధన్

వియత్నాంలో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ ప్రీ ప్రొడక్షన్ చర్చలు

ఇంట్లోనే పురుషులుంటే.. వీధుల్లోకి మహిళలు వెళ్తే పరిస్థితి ఏంటి? చిన్మయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

తర్వాతి కథనం
Show comments