Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట‌ర్ చ‌దువుతుంటే, పేలిన బాంబు... చ‌ర్ల శివారులో టెన్షన్!

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:01 IST)
మావోయిస్టులు ఓ చెట్టుకు త‌మ వాల్ పోస్ట‌ర్ ని అంటించారు. అందులో ఏం రాశారో ఆస‌క్తిగా చ‌దువుతుంటే, ఒక్క‌సారిగా బాంబు పేలింది. యువ‌కుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.
 
భద్రాచలం మావోయిస్టులు పోస్టర్ల చెంత అమర్చిన ప్రెషర్ బాంబు పేలడంతో పూజారి గూడెం గ్రామానికి చెందిన బ్రహ్మనాయుడు అనే యువకుడు గాయపడ్డాడు. చర్ల శివారు లెనిన్ కాలనీ సమీపంలోని మామిడితోట దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే, ఈనెల 13 న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్ లో మామిడి తోట వద్ద పలు చెట్లకు మావోయిస్టు పార్టీ చర్ల - శబరి ఏరియా కమిటీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. 
 
ఆలం పూజారిగూడెం నుంచి లెనినా కాలనీ వైపు తన ద్విచక్రవాహనంపై వెళ్తున్న బ్రహ్మనాయుడు రోడ్డు పక్కన చెట్టుకు ఉన్న పోస్టర్ గమనించాడు. అందులో ఏముందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో వాహనంపైనే పోస్టరు ఉన్న చెట్టు చెంతకు వెళ్ళి మ్యాటర్ చదువుతుండగా, అకస్మాత్తుగా బాంబు పేలడంతో ఎగిరి రోడ్డుపై ప‌డ్డాడు. రక్తస్రావంతో ఉన్న అతడిని హుటాహుటిన బాటసారులు చర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
 
 పోస్టర్ల చెంత మావోయిస్టులు బాంబులు పెట్టడం ఎంతవరకు కరక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇది సామాన్యుల ప్రాణాలకు ముప్పుకాదా ఏజెన్సీవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో మావోయిస్టుల చర్య పట్ల ఏజెన్సీ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments