Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వైసీపీలోకి భారీగా చేరిక‌లు... విజ‌య‌సాయి రెడ్డి స‌మ‌క్షంలో

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (11:33 IST)
టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల నుండి నాయకులు, కార్యకర్తలు భారీగా వైసీపీలో చేరారు. విశాఖ‌లోని సీతమ్మధారలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి క్యాంప్ ఆఫీస్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప‌లువురు వైసీపీలో చేరారు.
 
 
గాజువాక ఎమ్మెల్యే తిప్పలు నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే  రెహమాన్, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు,  ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణకుమారి, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ,  పార్టీ కండువా కప్పారు. 
 
 
త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని, ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపిలో వివిధ పదవుల్లో ఉన్న వాళ్ళు వైసీపీలోకి వస్తున్నారని, దీంతో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులు కూడా, తిరిగి పార్టీలోకి చేరడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక 31వ వార్డు బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి నడుపూరు కళ్యాణ్ కుమార్, 31వ వార్డు టిడిపి నాయకులు నవీన్ కుమార్, వారి అనుచరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.


అలాగే వైసిపి రెబల్స్ రంభ నారాయణ మూర్తి, చిక్క సత్య నారాయణ, సౌకత్ ఆలీ, సన్నటి పూర్ణానంద శర్మ, తదితరులు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుoబాక విజయసాయిరెడ్డి గారి సమక్షంలో వైసీపీలోకి చేరారు. అదేవిధంగా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ద్వారా మరికొంత మంది, వైసీపీ కార్పొరేటర్ నారాయణ ద్వారా ఇంకొంత మంది వైసీపీ కండువా కప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments