Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నివాసం కూడా అక్రమ నిర్మాణమే... కూల్చివేత తప్పదు : ఎమ్మెల్యే ఆర్కే

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (10:56 IST)
కృష్ణానది కరకట్టపై సుమారుగా 60 అక్రమ నిర్మాణాలు ఉన్నాయనీ, వాటన్నింటిని కూల్చివేయక తప్పదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు. ముఖ్యంగా, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమే అని, దాన్ని కూడా కూల్చివేయక తప్పదని ఆర్కే అంటున్నారు. 
 
కరకట్టపై గత టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు మంగళవారం రాత్రి నుంచి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రానికికల్లా ఈ కూల్చివేత పనులు ముగియనున్నారు. 
 
ఈ నేపథ్యలో కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కరకట్టపై దాదాపుగా 60కి పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయనీ, వాటన్నింటిని కూల్చివేయాలని కోరారు. అదేసమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమేనని, అందువల్ల ఆయన తక్షణం ఇంటిని ఖాళీ చేసి, ఇతరులకు మార్గదర్శకంగా నిలవాలని ఆర్కే సూచన చేశారు. 
 
ప్రజా వేదిక కూల్చివేతను జనం హర్షిస్తున్నారని, అటువంటి పరిస్థితుల్లో అక్రమ కట్టడంలో ఉన్న చంద్రబాబు ఇంకా అక్కడే ఉండాలని అనుకోవడం సబబు కాదన్నారు. అయినా చంద్రబాబును తాను వదిలి పెట్టేది లేదన్నారు. కరకట్టమీద 60కిపైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటికీ  నోటీసులు జారీ చేయించినట్లు తెలిపారు. వాస్తవానికి ఈనెల 21వ తేదీనే ఈ కేసులన్నీ న్యాయస్థానం ముందుకు రావాల్సి ఉందన్నారు. అయితే వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు సమర్థుడన్నారు. అక్రమ నిర్మాణాలపై నోటీసులు అందుకున్న వారంతా తమంత తాము కట్టడాలను ఖాళీ చేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments