Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురు పిల్లల తండ్రి... ఆ యువతిని కూడా పెళ్లి చేసుకుంటానని భార్యకు చెప్పీ...

Webdunia
ఆదివారం, 28 జులై 2019 (14:03 IST)
అతడికి అప్పటికే వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో పెళ్లి చేసుకుని భర్తకు దూరంగా ఉన్న ఓ మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు తీసుకున్నాడు.
 
ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో పాతమంగళగిరి సీతారామస్వామి కోవెల ప్రాంతానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తికి ఓ మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేసమయంలో ఓ యువతికి వివాహమై గత మూడేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. పాతమంగళగిరిలోని పుట్టింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం సత్యనారాయణ ఇంట్లో తెలిసింది. 
 
ఆ యువతిని కూడా తాను వివాహం చేసుకుంటానని అతడు భార్యకు చెప్పాడు. ఆ సమాధానం విని భార్య ఖంగుతింది. ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు భర్త. అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో సత్యనారాయణ, ఆ యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి శనివారం మధ్యాహ్నం మంగళగిరి కొండపై పానకాల స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ విషం సేవించేందుకు ప్రయత్నించారు. 
 
ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆమె చేతిలోని గ్లాసును విసిరికొట్టి, సీసాలోని విషాన్ని తాగేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లేలోపే... ఆ యువతి తండ్రి అక్కడికి చేరుకుని ఇద్దరినీ ద్విచక్రవాహనంపై కొండ దిగువన ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు. అప్పటికే సత్యనారాయణ మృతిచెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments