Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక మాండ్య అరకేశ్వరాలయంలో దారుణం, ముగ్గురు అర్చకుల హత్య

Webdunia
శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (23:13 IST)
కర్ణాటకలోని మాండ్య నగర శివారు ప్రాంతంలో ఘోరం జరిగింది. స్థానికంగా ఎంతో ప్రసిద్ది చెందిన అరకేశ్వరాలయంలో దోపిడీకి వచ్చిన దొంగలు ముగ్గురు అర్చకులను దారుణంగా బండరాయితో మోది చంపారు. మాండ్య నగర సమీపంలో గుట్టలు ప్రాంతంలో అరకేశ్వరస్వామి దేవాలయం వుంది.
 
అయితే ఈ ఉదయం ఆలయంలో ముగ్గురు అర్చకులు రక్తపు మడుగులో విగత జీవులై పడి ఉండటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పైగా ఆలయ హుండీలు పగలగొట్టిన స్థితిలో కనిపించడంతో ఇది దోపిడీ దొంగలు పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. హత్యకు గురైన అర్చకులను గణేశ్, ప్రకాశ్, ఆనంద్‌గా గుర్తించారు. వారి తలలను బండ రాళ్లతో పగలగొట్టి ఉండటం అక్కడి భయాందోళన వాతావరణాన్ని సృష్టించింది.
 
దొంగలు హుండీ లోని కరెన్సీ నోట్లను మాత్రం ఎత్తుకొని మిగతా వాటిని వదిలి వెళ్లారు. కాగా దొంగల దాడిలో మరణించిన ముగ్గురు బంధువులు కావడం విశేషం. ఆలయ భద్రత కోసం ఆ ముగ్గురు అక్కడే నిద్రిస్తుంటారు. నిద్రలో ఉండగా దొంగలు ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. హుండీని దోచుకున్న దొంగలు గర్భగుడి లోపల గాలించినట్లు తెలుస్తున్నది.
 
దీనిపై మాండ్య జిల్లా ఎస్పీ పరశురామ్ మాట్లాడుతూ ఈ ఘటనకు కారకులైన వారికోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై కర్ణాటక సీఎం బీఎస్ యడ్డ్యూరప్ప తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ల‌ ఒసేయ్ అరుంధతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments