Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ప‌ర్మిష‌న్ తోనే మీడియా ఎదుటికి వెళ్ళాలి: మోహ‌న్ బాబు హుకుం!

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (09:54 IST)
మా ఎన్నిక‌ల అనంత‌రం మంచు ఫ్యామిలీ సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధిప‌త్యాన్ని సంపాదించే య‌త్నంలో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. మోహ‌న్ బాబు ఈ సంద‌ర్భంగా మా స‌భ్యుల‌కు దాదాపు హుకుం జారీ చేశారు. మా ప‌ర్మిష‌న్ లేనిదే మీడియా ఎదుటికి ఏ స‌భ్యుడూ వెళ్ళ కూడ‌ద‌ని ఆయ‌న ఖ‌రాఖండితంగా చెప్పారు. 
 
మా స‌భ్యులంతా సంయమనం పాటించాల‌ని మోహన్‌బాబు చెప్పారు. మా ఎన్నికల కౌంటింగ్  సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. సభ్యులంతా సంయమనం పాటించాలని కోరారు. ‘‘ప్యానల్‌లో గెలిచిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఎవరూ ఓవరాక్షన్‌ చేయొద్దు. మేమే మీడియా ముందుకు వస్తాం’’అని మోహన్‌బాబు తెలిపారు. ఇక్క‌డితో స‌రి కాదు... ముందు ముందు కూడా మీడియా ఎదుటికి వెళ్ళి ప‌లుచ‌న కావ‌ద్ద‌ని, ప్ర‌తిదానికి మా ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌న్నారు.
 
హోరాహోరీగా సాగిన ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. విమర్శలు, వివాదాలు నడుమ సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు విజయం సాధించగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతో గెలుపొందారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్‌ నుంచి పృథ్వీ రాజ్‌ విజయం సాధించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments