Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

ఠాగూర్
మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (11:16 IST)
సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు కుటుంబ కలహాలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. తన రెండో కుమారుుడ మంచు మనోజ్‌పై ఆయన గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాకారాపేటల పోలీసులు మంచు మనోజ్‌ను మంగళవారం ఉదయం అపుదులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. తిరుపతిలోని డాక్టర్ మోహన్ బాబు విద్యా సంస్థల్లోకి వెళ్లందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్న విషయం తెల్సిందే. 
 
తాజాగా మంచు మనోజ్‌ పోలీసుల తీరును నిరసిస్తూ తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 11.15 గంటలకు నుంచి అర్థరాత్రి వరకు ఆయన పోలీస్ స్టేషన్‌ వద్దే బైఠాయించారు. తాను, తన సిబ్బందితో కనుమ రహదారిలోని  లేక్‌వ్యాలీ రెస్టారెంట్‌లో బస చేశానని, పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటూ ప్రశ్నించి, స్టేషన్‌కు పిలిపించారని పేర్కొన్నారు. 
 
తాము పోలీస్ స్టేషన్‌కు వచ్చేసరికి ఎస్ఐ లేరని తెలిపారన్నారు. తాను, తమ సిబ్బంది ఎక్కడికి వెళ్లినా పోలీసులు ఇబ్బందిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సీఐ ఇమ్రాన్ బాషాతో మనోజ్ ఫోనులో మాట్లాడారు. తాము ఎంబీయూ విద్యార్థుల కోసం పోరాడుతుంటే ఇలా ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాప్సికమ్ ప్రయోజనాలు ఏమిటి?

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments