Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌ ప్లాన్ అంత పవర్‌ఫుల్లా? మంచు మనోజ్ అలా ట్వీట్ చేశాడే...!!

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:27 IST)
ఎన్నికల నగారా త్వరలోనే మోగనుండడంతో పవన్ కళ్యాణ్ తన పార్టీని సమాయత్తం చేసే దిశగా పలు వ్యూహాలు రచించుకుపోతున్నారు. దానికి తగినట్లే జనసేన పార్టీలోకి చేరికలు కూడా పెరుగుతున్నాయి. అయితే... ఇక్కడే పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారని భోగట్టా. 
 
తన పార్టీలో బలమైన నేతలకు కాకుండా మేథావులకు చోటు కల్పించే దిశగా ముందుకు పోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఉన్నత విద్యలు చదువుకున్న చాలామంది ఈ పార్టీలో చేరి ఉండడం తెలిసిందే. కాగా పవన్ తన పార్టీలోకి దాదాపు... విద్యావంతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయి అధికారులు, మాజీ పోలీస్ అధికారులు, మాజీ ఐఏయస్ అధికారులు, సీనియర్ జర్నలిస్టులు ఇలా పలువురు ప్రముఖులనే ఆహ్వానిస్తూ ఉండడం గమనార్హం. 
 
అయితే... తాజాగా దీనిపై స్పందించిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. 'ప్రజా సేవ చేయడానికి విద్యావంతుల సహాయం తీసుకుంటే దానికొక విలువ, అర్ధం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వాళ్లపై నమ్మకం ఉంచి, గౌరవంతో జనసేన పార్టీలోకి తీసుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉంది' అంటూ ట్వీట్ చేసిన మనోజ్ ఇటీవలి కాలంలో సినిమాలకు దూరంగా ఉంటూ.. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న తనను పరిగణించమని పరోక్షంగా ఏమైనా అభ్యర్థిస్తున్నారేమోనని కూడా పలువురు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. 
 
కాగా... మనోజ్ ట్వీట్‌ని చూసిన పవన్ అభిమానులు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి భవిష్యత్తులో పవన్, మనోజ్‌లు రాజకీయపరంగా కలిసి పని చేస్తారేమో చూడాలి... ఇది మరో మల్టీస్టారర్ రాజకీయం అవుతుందే వేచి చూద్దాం...

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments