Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్శిల్ మృతదేహం మిస్టరీ : నిందితురాలిగా పదేళ్ల కుమార్తె!

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (17:07 IST)
వెస్ట్ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ఈ నెల 19వ తేదీన సాగి తులసి ఇంటికి 'పార్శిల్లో మృతదేహం డోర్ డెలివరీ' అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం ఇప్పుడు సంచలనం రేపుతోంది. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే.. తులసి ఆస్తిని కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతడి ఇద్దరు భార్యలు కలిసి ఈ దారుణానికి పాల్పడగా, ఈ హత్యలో మూడో భార్య కుమార్తె అయిన.. పదేళ్ల బాలిక పాత్ర ఉన్నట్టు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. 
 
పోలీసుల కథనం మేరకు.. శ్రీధర్ వర్మ తల్లిదండ్రులు కాళ్ల మండలం కోపల్లెలో చెరువులపై పనిచేస్తూ అక్కడే జీవిస్తుంటారు. అతడి మొదటి భార్య ఎలిజబెత్ రాణి గాంధీనగరులో ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. రెండో భార్య రేవతికి పిల్లలు లేరు. ఆమెను మొగల్తూరులో ఉంచాడు. మూడో భార్యగా చెబుతున్న సుష్మకు పదేళ్ల కుమార్తె ఉంది. ఆమెను కాళ్ల పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఇంట్లో ఉంచినట్లు తెలిసింది. వీరితోపాటు రెండో భార్య రేవతి.. తన అక్క తులసి ఆస్తిని కాజేయాలని ప్లాన్‌ ఉండడంతోనే భర్తకు సహకరించేదని సమాచారం. 
 
మృతదేహాన్ని పార్శిల్ చేసి పంపిన వెంటనే శ్రీధర్ వర్మ పరారు కాగా, శ్రీధర్ వర్మే నిందితుడని నిర్ధారణకు వచ్చిన పోలీసులు అతడి కోసం గాలించారు.  కొన్ని సీసీ కెమెరాల్లో కనబడినట్లుగా కనిపించి, ఆ రూట్లలో కాకుండా మరో రూట్లలో వెళుతూ పోలీసులను దారి మళ్లించాడు. నాలుగు రోజులపాటు ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం కృష్ణా జిల్లా బంటుమిల్లి వద్ద పోలీసులకు దొరికేశాడు. 
 
విచారణలో భాగంగా నిందితుడు శ్రీధర్ వర్మను హత్య జరిగినట్లు బావిస్తున్న ఉండి మండలం వాండ్రం రహదారి వైపుకు గురువారం తీసుకువెళ్లారు. అతడి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరిని భీమవరం, ఆకివీడు, కాళ్ల, ఉండిలలో రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments