Webdunia - Bharat's app for daily news and videos

Install App

కులదురహంకార హత్య.. కారులో ఎక్కించుకున్నారు.. గొంతుకోశారు..

Webdunia
శనివారం, 18 జూన్ 2022 (19:25 IST)
రాప్తాడు మండలంలో దారుణం జరిగింది. ఓ యువకుడు కులదురహంకార హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండల కేంద్రమైన కనగానపల్లిలో ఉంటోన్న బిసి సామాజిక తరగతికి చెందిన చిట్రా నాగను, ముత్యాలమ్మ దంపతుల కుమారుడు కురుబ చిట్రా మురళి (27) అదే గ్రామంలోని ఒసి సామాజిక తరగతికి చెందిన ఎం.వీణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
 
సామాజిక తరగతులు వేరంటూ వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో, వీరిద్దరూ పెద్దలను ఎదిరించి 2021 ఆగస్టులో వివాహం చేసుకున్నారు.  వీరిద్దరూ రాప్తాడులో ఉంటూ వారివారి ఉద్యోగాలకువెళ్లి వస్తుండేవారు. గురువారం రాత్రి కియాకువెళ్లేందుకు రాప్తాడు వై.జంక్షన్‌ వద్ద మురళి వేచి ఉన్నాడు. అప్పటికే అక్కడ కాపుకాచి ఉన్న యువతి కుటుంబ సభ్యులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించారు.
 
అక్కడి నుంచి రాప్తాడు సమీపంలోని త్రిబుల్‌ ఆర్‌ ‌ రెస్టారెంట్‌ వద్దకుతీసుకెళ్లి కత్తితో మెడకోసి హత్య చేసి సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కుటుంబసభ్యులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments