Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను వేధిస్తున్నాడని యువకుడిని హత్య చేసిన భర్తకు జీవితఖైదు

భార్యను ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలుసుకున్న భర్త అతడిని హత్య చేసి పూడ్చేశాడు. ఈ కేసులో హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, మూడువేల రూపాయల జరిమానా పడింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం పెదపాడు మండలం కొత

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (10:18 IST)
భార్యను ఓ యువకుడు వేధిస్తున్నాడని తెలుసుకున్న భర్త అతడిని హత్య చేసి పూడ్చేశాడు. ఈ కేసులో హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు, మూడువేల రూపాయల జరిమానా పడింది. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బడుగు ఆలీ (20) తల్లిదండ్రులు చనిపోవడంతో అతని బంధువైన బడుగు ప్రేమావతి వద్ద ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన కూరెళ్ళ వెంకటేశ్వరరావు (28) భార్యను ఆలీ వేధిస్తున్నట్టుగా గుర్తించి కక్ష పెంచుకున్నాడు. 
 
2013 డిసెంబర్‌ 23వ తేదీన అలీని తన వెంట తీసుకెళ్లిన వెంకటేశ్వరరావు.. ఫూటుగా తాగించి ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న కాల్వ వద్దకు తీసుకువెళ్ళి హత్యచేసి అక్కడే పూడ్చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన పోలీసులు వెంకటేశ్వర రావును నిందితుడని తేల్చారు. ఈ కేసు ఏలూరులోని జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టులో విచారణ సాగింది. నిందితుడైన వెంకటేశ్వరరావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.మూడు వేలు జరిమానా విధించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments