నడుముకు నల్లని తాడు.. చాలా బలంగా కనిపించాడు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (10:41 IST)
మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తెలిపింది.


ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత చెప్పింది. తనను హత్య చేయాలని కొందరు నిఘా పెట్టారని అమృత వర్షిణి మీడియా ముందు అమృత చెప్పుకొచ్చింది.
 
తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని.. కానిస్టేబుల్‌ను చూసిన ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్‌ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. 
 
తనను చంపితే, అమృత తమ నుంచి దూరమవుతుందన్న ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments