గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశించింది. పటిష్ట బందోబస్తు వున్నప్పటికీ సెక్యూరిటీ కళ్లుగప్పి చిరుత సచివాలయంలోకి ప్రవేశించింది. గుజరాత్, గాంధీనగర్‌లోని అత్యంత భారీ భద్రతను దాటుకుని లోపలికి ప్రవేశించింది.
గేట్లు మధ్య ఉన్న ఖాళీ స్థలం ద్వారా ప్రవేశించడం.. ఈ చిరుత ఎంట్రీ ఇవ్వడం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన సచివాలయం భవనం, ముఖ్యమంత్రి కార్యాలయం పరిసరాల్లోకి ఓ చిరుతపులి ప్రవేశించడం తీవ్ర కలకలం రేపింది.
చిరుత ప్రవేశించిన విజువల్స్ చూసి అధికారులు షాకయ్యారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన అధికారులు, ఉదయం నుంచి చిరుత జాడ కోసం వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు ఇంద్రోదా పార్క్ నుంచి ఈ చిరుత పులి ప్రవేశించి వుండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇక తాజా ఘటనలో అలర్టైన అధికారులు చిరుత మళ్లీ వస్తే పట్టుకునేందుకు బోనులను ఏర్పాటు చేశారు. చిరుత ఎటు వెళ్లిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం గుజరాత్ సచివాలయంలోకి చిరుత ప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.