Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌చిలీప‌ట్నం బెల్ కంపెనీ... దేశ రక్షణ పరికరాల ప్రదర్శన

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (16:06 IST)
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే గర్వకారణం అని, దేశ రక్షణ, భద్రతలో భారత్ ఎలక్ట్రానిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంద‌ని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని అన్నారు. మ‌చిలీప‌ట్నంలో శనివారం స్థానిక భారత్ ఎలక్ట్రానిక్స్ ను మంత్రి పేర్నినాని సందర్శించారు. 
 
 
ఆజాదీకా మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఈనెల 13 నుండి  19వ తేదీ వరకు భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారయ్యే దేశ రక్షణ పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల, కళాశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. భారత్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసిన పరికరాల‌ను, యుద్ధంలో వాడినప్పుడు సైనికులు  పొందే అనుభూతి వాటిని చూసినప్పుడు విద్యార్థులు కూడా గొప్ప అనుభూతి పొందగలరని మంత్రి అన్నారు. దేశ రక్షణకు వాడే పరికరాలు మచిలీపట్నంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లో తయారు కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ జనరల్ మేనేజర్ బి ప్రభాకర్ రావు, ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments