Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్ రాజీనామా ఆమోదించం.... ఆయ‌న ఐడియాలు మాకు కావాలి

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (12:34 IST)
ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను తాను ఆమోదించబోనని మా అధ్య‌క్షుడు మంచు విష్ణు చెప్పారు.  ప్రకాష్ రాజు ఐడియాలు, వారి అనుభవం త‌న‌కు కావాలని అన్నారు. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని ఆయ‌న ప్ర‌కాష్ రాజ్ కు, ఆయ‌న ప్యానెల్ స‌భ్యుల‌కు సూచించారు. తెలుగువాడు కాదు...నాన్ తెలుగు అనే ప్యాక్టర్ ప్రకాష్ రాజ్ ను ఓడగొట్టింనేది తాను నమ్మను అని విష్ణు చెప్పారు. 250 మంది వరకు తెలుగు వాళ్లు ఓట్లేసి ప్రకాష్ రాజ్ కావాలని కోరారని విష్ణు చెప్పారు. శ్రీకాంత్ తో కలిసి పనిచేస్తానిని మంచు విష్ణు అన్నారు.
 
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసినా దానిపై రచ్చ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ తాను మాకు రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే నాగ‌బాబు, ఇత‌ర న‌టులు కొంద‌రు తాము రాజీనామా చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే, దీనిపై మంచు విష్ణు మాత్రం చాలా ప‌రిప‌క్వ‌త‌గా కామెంట్ చేశారు. వారి సేవ‌లు మాకు కావాల‌ని వివ‌రించారు. 
 
మ‌రో ప‌క్క మంచు విష్ణు చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి త‌న‌ను సైడ్ అవ్వమని చెప్పారని, విత్ డ్రా చేసుకోమన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పకూడదని అనుకున్నప్పటికీ ఎన్నికలు ముగియడంతో చెప్పా అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడే అయినా, తన ఓటు ప్రకాష్ రాజ్ కే వెళ్లిందని అన్నారు. ప్రకాష్ రాజ్, నాగబాబు రాజీనామాలను తాను ఆమోదించబోనన్నారు. హీరో శ్రీకాంత్ తో కలిసి తాను పని చేస్తాన‌ని మంచు విష్ణు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments