Webdunia - Bharat's app for daily news and videos

Install App

బలపడుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్షం

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (13:41 IST)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింతగా బలపడింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్ గడ్, తెలంగాణ మీదుగా ఒడిసా వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాలల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
చాలా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం  ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. కోస్తా తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు.
 
కాగా గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని హైదరాబాదు, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం తదిత జిల్లాలలో పాటు ఏపీ లోని ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురిసాయి.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments