Webdunia - Bharat's app for daily news and videos

Install App

22న అల్పపీడనం!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (11:37 IST)
వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఉత్తర అండమాన్‌ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం బలపడి 24వ తేదీకి తుఫానుగా ఏర్పడే అవకాశముందని అన్నారు.

ఇది వాయువ్య దిశగా ప్రయాణించి 26న ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో పశ్చిమ దిశ నుండి గాలులు వీస్తున్నాయని తెలిపారు. రాగల 3 రోజులు రాష్ట్రంలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రలో నేడు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

శనివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. రాయలసీమలో శుక్ర, శనివారాల్లో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments