ఉత్తర కోస్తా, ఆంధ్రాలో ఉరుముల‌తో మోస్తరు వర్షాలు

Webdunia
బుధవారం, 3 నవంబరు 2021 (14:13 IST)
కొమరిన్, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం లక్ష ద్వీపం, ఆగ్నేయ అరేబియా సముద్రం మీద ఉంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4. 5 కిలోమీట‌ర్ల ఎత్తున విస్తరించి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం  ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి  రాగల 3 -4  రోజులలో మరింత బలపడుతుంది. 
 
 
ఒక ఉపరితల ద్రోణి  కొమరిన్, ఉత్తర శ్రీలంక పరిసర ప్రాంతాల మీద నుండి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మరియు దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు  మన్నార్   గల్ఫ్  మరియు తమిళనాడు తీర ప్రాంతం మీదుగా సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న  ఉపరితల ద్రోణి  వ్యాపించి ఉంది.
 
 
వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలున్నాయి. ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక  ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ నుండి అతి భారీ  వర్షాలు  కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక  ప్రదేశాల‌లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక  ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.
 
            
ఈరోజు దక్షిణ  కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక   చోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు,  దక్షిణ  కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.ఒకటి లేక రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక     ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది. 
 
                               
రాయలసీమలో ఈరోజు,రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండు చోట్ల భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉంది.                 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments