Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కథా చిత్రం "మౌనం" థియేట్రికల్ ట్రైలర్ విడుద‌ల‌

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (16:24 IST)
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ఆహ్లాదభరిత ప్రేమ కథా చిత్రం "మౌనం". పారా సైకాలజీ నేపథ్యంలో రూపొందిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రానికి "వాయిస్ ఆఫ్ సైలెన్స్" అన్నది ట్యాగ్ లైన్. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం ముఖ్య ఆకర్షణగా... "మల్లెపువ్వు" ఫేమ్ మురళి-"బిగ్ బాస్" ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఆవిష్కరించారు.
 
"మణిరత్నం" మౌనరాగం తరహాలో... తన మిత్రుడు మురళి నటించిన "మౌనం" మంచి విజయం సాధించాలని రమేష్ వర్మ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అక్టోబర్ ప్రథమార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాతలు అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి మాట్లాడుతూ... "మౌనం" కూడా కొన్ని సందర్భాల్లో ఎంత శక్తివంతంగా ఉంటుందో చాలా సెన్సిబిల్ గా చూపించే పారా సైకలాజికల్ థ్రిల్లర్ "మౌనం". అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. "మౌనం" థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసిన రమేష్ వర్మగారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు" అన్నారు.
 
ఐశ్వర్య అడ్డాల, 'శివ' ఫేమ్ చిన్నా, జీవా, ధనరాజ్, శేషు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కథ: అనిల్, స్క్రీన్ ప్లే-ఎడిటింగ్: శివ శర్వాణి, సంగీతం: ఎమ్.ఎమ్.శ్రీలేఖ, నిర్మాతలు: అల్లూరి సూర్యప్రసాద్-సంధ్య రవి, ఛాయాగ్రహణం-దర్శకత్వం: కిషన్ సాగర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments