Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసా, సేవ లేదు కానీ ప్రసాదం ధరను పెంచేశారు..?

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (17:45 IST)
తిరుమల శ్రీవారి ప్రసాదం ధరలను అమాంతం పెంచేసిది టిటిడి. ప్రస్తుతం తిరుమల శ్రీవారికి తిరుప్పావడ సేవ నిర్వహించకపోయినా ప్రసాదం అందుబాటులో లేకపోయినా ధరను మాత్రం పెంచేసింది టిటిడి. 
 
కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవారి ఆలయంలో ప్రతిది ప్రత్యేకమే. అన్నీ అపురూపమే. స్వామివారి దివ్యమంగళ రూపం మొదలుపుకుని స్వామవారికి నిర్వహించే ఆర్జిత సేవలు, శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. 
 
రోజుకో రకం నైవేధ్యాలను సమర్పిస్తారు. ఇలా శ్రీవారికి అనేక రకాల ప్రసాదాలు నైవేధ్యంగా సమర్పించినా అవి పరిమితమైన దిట్టంలోనే కావడంతో భక్తులకు అన్ని రకాల ప్రసాదాలు అందుబాటులో ఉండవు. లడ్డూలు కావాలంటే వడ ప్రసాదాలు కావాలన్నా భక్తులు కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. 
 
శ్రీవారికి ప్రతి గురువారం తిరుప్పావడ సేవ నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రత్యేకంగా జిలేబి, మురుకు ప్రసాదం సమర్పిస్తారు. వీటిని పరిమితంగానే తయారుచేస్తారు. ఏడు లేదా ఎనిమిది పడిలను తయారచేస్తారు. ఒక్క పడికి 51 జిలేబీలు ఉంటాయి. ఆ రోజుకు జారీ చేసిన టిక్కెట్ల సంఖ్యను బట్టి జిలేబీల తయారవుతాయి. 
 
ఇలా టిక్కెట్లు తీసుకున్న భక్తులకు ఇవ్వగా మిగిలిన 70 నుంచి 80 జిలేబీలను విక్రయిస్తారు. అది కూడా సిఫార్సు లేఖలపైనే జారీ చేస్తారు. ఇప్పుడు జిలేబీలకు ఉన్న డిమాండ్‌ను తగ్గించేందుకే అంటూ వాటి ధరను వంద నుంచి 500 రూపాయలకు పెంచేసింది టిటిడి.
 
ధర పెంపు కారణంగా టిటిడికి అదనంగా లభించే ఆదాయం కేవలం 32 వేలు మాత్రమే. ప్రస్తుతం స్వామివారికి తిరుప్పావడసేవ కూడా నిర్వహించడం లేదు. ప్రసాదం కూడా తయారు చేయడం లేదు. 

సంబంధిత వార్తలు

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments