Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ చట్టంలో లొసుగులు: ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (06:02 IST)
దేశంలో మహిళలకు స్వాతంత్య్రం రాలేదని రాష్ట్ర హోం మంత్రి సుచరిత అన్నారు. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.

దేశవ్యాప్తంగా ప్రతీ ఏటా 30 లక్షల నేరాలు నమోదవుతుంటే రాష్ట్రంలో 1.50 లక్షల నేరాలు ఉన్నాయని తెలిపారు. అందులో ప్రతీ ఏటా మన దేశంలో 15 వేల కేసులు మహిళలకు సంబంధించి నమోదు కావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు.  మహిళలపై అకృత్యాలు జరిగే దేశాల్లో మన దేశం ప్రథమ స్థానంలో ఉండడం సిగ్గు చేటని ఆవేదన వెలిబుచ్చారు.

నిర్భయ ఘటనతో కేంద్రంలో చట్టం చేసినప్పటికీ.. అందులో లొసుగుల కారణంగా నేరస్థులను జైలులో మేపుతున్నారని మండిపడ్డారు. మహిళా రక్షణకే దిశ చట్టం తెచ్చామన్నారు. ప్రతి పాఠశాలలోనూ మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టాలని సూచించారు.

మహిళలకు ఆపద వస్తే 100, 1012, 181 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు. అనంతరం హోం మంత్రిని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సత్కరించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments