Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి.. ఏపీ హోం మంత్రి

Advertiesment
ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి.. ఏపీ హోం మంత్రి
, సోమవారం, 19 ఆగస్టు 2019 (08:41 IST)
కృష్ణానది వరద ముంపు బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
 
గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో వరదలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వరదప్రభావంతో కృష్ణాజిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. 
 
రెండు జిల్లాల్లో కలిపి ఇద్దరు చనిపోయారని.. ముందస్తు చర్యలు తీసుకున్నందునే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణాలో 2,239 ఎకరాలు, గుంటూరులో 2,470 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. 
 
పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాట‌లక‌న్నా ఛాయాచిత్రం సందేశం మిన్న..తమ్మినేని