నేటి నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

Webdunia
మంగళవారం, 30 మే 2023 (09:12 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభంకానుంది. రాజమండ్రిలో జరిగిన టీడీపీ మహానాడు కారణంగా ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు పాదయాత్రను వాయిదా వేశారు. ఇపుడు నాలుగు రోజుల విరామం తర్వాత ఆయన మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభించారు.
 
కాగా, ఆయన తన పాదయాత్రను కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో చేశారు. మే 30వ తేదీ మంగళవారం నుంచి జమ్మలమడుగు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆయన పాదయాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశాయి. 
 
ఇప్పటివరకు మొత్తం 111 రోజుల పాటు పాదయాత్ర జరుగగా నారా లోకేశ్ నడిచిన మొత్తం దూరం 1423.7 కిలోమీటర్లని తెలిపింది. మంగళవారం నుంచి మళ్లీ ప్రారంభమయ్యే పాదయాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు జమ్మలమడుగు క్యాంప్ సైట్ నుంచి మొదలై 4.20 గంటలకు పెద్ద పులుసు మోటు వద్ద స్థానికులతో మాటామంతీ. 
 
సాయంత్రం 4.30 గంటలకు సంజాముల మోటు వద్ద బహిరంగ సభ. యువనేత ప్రసంగం. 5.45 గంటలకు జమ్మలమడుగు పాత బస్టాండు గాంధీ విగ్రహం వద్ద స్థానికులతో మాటామంతీ. 6.15 గంటలకు కన్నెలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం. 8.15 గంటలకు ధర్మవరం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ. 9 గంటలకు శేషారెడ్డి పల్లె పాలకోవా సెంటరులో స్థానికులతో మాటామంతీ. 9.30 గంటలకు దేవగుడి సుంకులాం దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: నయనతార గైర్హాజరు - అనిల్ రావిపూడికి వాచ్ ని బహూకరించిన చిరంజీవి

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments