Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం

yuvagalam
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (08:58 IST)
తన వియ్యంకుడు, తెలుగు హీరో నందమూరి తారకరత్న మృతిపై తాత్కాలికంగా ఆపిన యువగళం పాదయాత్రను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం నుంచి పునఃప్రారంభించారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సాగుతోంది. గత నెల 27వ తేదీ నుంచి నారా లోకేశ్ తన పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. 
 
అయితే, ఈ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న హీరో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనకు తొలుత కుప్పంలోనూ ఆ తర్వాత బెంగుళూరులోను చికిత్స అందించారు. కానీ, ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో నారా లోకేశ్ తన పాదయాత్రను ఆది, సోమవారాల్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో సోమవారం తారకరత్న అంత్యక్రియలు పూర్తికాగానే, సోమవారం నుంచి ఆయన మళ్లీ తన పాదయాత్రను మొదలుపెట్టారు. 
 
లోకేశ్ పాదయాత్ర వివరాలను పరిశీలిస్తే, ఇప్పటివరకు ఆయన 296.6 కిలోమీటర్ల మేరకు పాదయాత్రలో నడిచారు. యువగళం పాదయాత్ర 23వ రోజు షెడ్యూల్ (21.02.2023) ప్రకారం.. 
 
ఉదయం
8.00 - శ్రీకాళహస్తి ఆర్టీవో ఆఫీస్ ఎదుట విడిది కేంద్రంలో ముస్లింలతో ముఖాముఖి.
9.00 - పాదయాత్ర ప్రారంభం.
9.20 - మిట్టకండ్రిగలో స్థానికులతో మాటామంతీ.
11.00 - తొండంనాడులో స్థానికులతో మాటామంతీ.
11.15 - తొండమానుపురం దిగువ వీధిలో 300 కి.మీ పూర్తి అయిన సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ.
11.20 - తొండమానుపురం దిగువ వీధిలో మహిళలతో ముఖాముఖి.
 
మధ్యాహ్నం
12.10 - సుబ్బానాయుడు కండ్రికలో స్థానికులతో మాటామంతీ.
1.30 - వెంకటాపురంలో భోజన విరామం
2.30 - బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో సమావేశం.
 
సాయంత్రం
4.00 – బండారుపల్లిలో స్థానికులతో మాటామంతీ.
5.30 - కోబాక విడిది కేంద్రంలో బస.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెషర్లకు తేరుకోలేని షాకిచ్చిన విప్రో... ప్యాకేజీల్లో భారీగా కోత