Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌: భర్త దూరంగా ఉన్నాడని కొండపై నుంచి దూకేసిన భార్య

Webdunia
శనివారం, 30 మే 2020 (14:49 IST)
భర్త బెంగుళూరులో.. భార్య ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో. లాక్ డౌన్‌తో ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. భర్త లేకుండా ఉండలేని భార్య ఆవేదనతో తీవ్ర మనస్థాపం చెంది కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
 
వారిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి. అయితే లాక్‌డౌన్ వారిద్దరినీ వేరు చేసింది. మదనపల్లెలోని వేంపల్లి పంచాయతీ మల్లయ్యకొండ వద్ద ఉన్న బాలాజీనగర్‌లో అత్తమామల ఇంటికి వచ్చింది భార్య సుజనకుమారి. 
 
అప్పుడే లాక్ డౌన్ స్టార్టయ్యింది. బెంగుళూరుకు వెళ్ళలేక అత్తమామతో కలిసి ఉండేది. భర్త విశ్వనాథ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఎలాగైనా మదనపల్లెకి వచ్చేయ్యమని భర్తను కోరింది. అయితే రాష్ట్ర సరిహద్దులో పంపించరని.. భార్యకు నచ్చచెబుతూ వచ్చాడు భర్త.
 
భర్త లేకుండా ఒంటరి జీవితాన్ని అనుభవించలేని భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ రోజు అత్త, మామలతో కలిసి మల్లయ్య కొండకు వెళ్ళింది. అత్త, మామలు కొండపై నమస్కారం చేస్తుండగా వారి కళ్ళు గప్పి అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్లి లోయలోకి దూకేసింది సుజన. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments