Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో లాక్డౌన్? క్లారిటీ ఇచ్చిన ఏపీ సీఎం జగన్

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (18:50 IST)
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే, ఈ వైరస్ బారినపడి అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో సెకండ్ వేవ్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అయినప్పటికీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రాత్రి నిర్భంధంతో పాటు కొన్నిచోట్ల లాక్డౌన్ కొనసాగుతోంది. 
 
తాజాగా లాక్‌డౌన్ నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖలో నాడు- నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా నిర్భంధం విధించడం వలన ఆర్థికంగా నష్టపోతామన్నారు. గతేడాది అమలు చేసిన లాక్డౌన్ వలన ఏపీకి రూ.21 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 
 
రాష్ట్రంలో మరోసారి అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొన్నటివరకు వందల్లో ఉన్న కేసులు ప్రస్తుతం 2 వేలకు పైగా చేరుకున్నాయి. దీంతో వ్యాక్సినేషన్ పంపిణీలో వేగం పెంచాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ముందుగా దృష్టిసారించాలన్నారు. 
 
గ్రామాల్లో రోజుకు 4లక్షలు, అర్బన్‌ ప్రాంతాల్లో 2లక్షల డోసులు అందజేయాలన్నారు. వాక్సినేషన్‌ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు, ఆశావర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్, శిరీష్, కిరణ్ అబ్బవరం దుబాయ్‌ లాండ్ అయ్యారు

ఓనమ్ పండుగ శుభాకాంక్షలతో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ స్పెషల్ పోస్టర్

విజయ్ ఆంటోనీ.. భద్రకాళి నుంచి పవర్ ఫుల్ సాంగ్ జిల్ జిల్ రిలీజ్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments