Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు: మంత్రి పేర్ని నాని

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:51 IST)
మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్ని నాని  తెలిపారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 15 రోజుల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా చట్టంలో మార్పులు తీసుకువస్తామని చెప్పారు.

ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు, మద్యం ప్రమేయం లేకుండా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అక్రమాలకు పాల్పడే వారిపై అనర్హత వేటు వేస్తామని… గరిష్టంగా మూడేళ్ళ వరకు జైలు శిక్ష కూడా పడేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి 8 రోజులు గడువును విధించామని మంత్రి తెలిపారు. 
 
సంస్కరణలకు కేబినెట్ ఆమోదం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సమయం కుదించాలని రాష్ట్ర కేబినెట్​ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు 5 రోజుల ప్రచార సమయమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 7 రోజుల ప్రచార సమయమివ్వడానికి అంగీకరించింది. సర్పంచి స్థానికంగానే ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రకృతి వైపరీత్యాలు, నీటిఎద్దడి వచ్చినప్పుడు సర్పంచి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్ని నాని వివరించారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments