Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మద్యం మరింత ప్రియం... 25 శాతం బాదుడు?!

Webdunia
ఆదివారం, 3 మే 2020 (15:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం మరింత ప్రియంకానుంది. రాష్ట్రంలో వైకాపా సర్కారు ఏర్పాటైన తర్వాత మద్యం ధరలను విపరీతంగా పెంచింది. అయినప్పటికీ మద్యం విక్రయాలు ఏమాత్రం తగ్గలేదు. ఇపుడు మరోమారు ఏకంగా 25 శాతం మేరకు ధరలను పెంచాలని ఏపీ సర్కారు భావిస్తోంది. కరోనా లాక్‌డౌన్ తర్వాత పెంచిన కొత్త ధరలతో మద్యం విక్రయాలు జరపాలని భావిస్తోంది. 
 
నిజానికి గత ఎన్నికల ప్రచార సమయంలో వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన ఆ దిశగానే అడుగులు వేశారు. బెల్టు షాపులను తొలగించారు. మద్యం అనుబంధ బార్లను ఎత్తివేశారు. పైగా, మద్యాన్ని ప్రభుత్వమే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. 
 
ఈ చర్యలన్నీ మద్యం నియంత్రణలో భాగంగానే తీసుకుంటున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఇపుడు మద్యం ధరలను 25 శాతం పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
రానున్న రోజుల్లో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. భౌతిక దూరం పాటించి మద్యం విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా సోమవార నుంచి దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments