Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ.. వారిని ఆదుకోండి..

Webdunia
బుధవారం, 16 మార్చి 2022 (18:45 IST)
ఉక్రెయిన్ బాధిత యువతీయువకుల విద్యాబ్యాసం ఇక్కడితో ఆగిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ సీఎం జగన్‌కు టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు నెలకొనడంతో చదువులు మధ్యలోనే ఆపేసి స్వరాష్ట్రానికి తిరిగివచ్చిన ఏపీ విద్యార్థుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని ఆ లేఖలో కోరారు నారా లోకేష్. 
 
వ‌చ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభమయ్యాయి. కానీ తాము చ‌దివే వ‌ర్సిటీ నుంచి ఎటువంటి స‌మాచారం లేక మరికొందరు అయోమ‌యంలో వున్నారు. కాబట్టి ఉక్రెయిన్ నుంచి వ‌చ్చిన విద్యార్థులు త‌మ కోర్సులు పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకునేందుకు  ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందని నారా లోకేష్ ఏపీ సీఎం జగన్‌ను విజ్ఞప్తి చేశారు.
 
''ఇప్పటికే ఏపీకి పొరుగున గల తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉక్రెయిన్ నుండి వచ్చిన తమ విద్యార్థుల కోర్సుల పూర్తికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని... ఆర్థికంగా అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఇలాగే విద్యార్థులు చ‌దువు పూర్త‌య్యే బాధ్య‌త‌ని తీసుకోవాల‌ని కోరుతున్నాను'' అని జగన్‌ ను లేఖ ద్వారా నారా లోకేష్ కోరారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments