Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో చిరుత కలకలం.. కుక్కను చంపి...

తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన రెండు బోన్లలో ఒక మగ చిరుతపులి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్టు అధికారులు బోను ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (17:10 IST)
తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఒక చిరుతపులి బోనులో చిక్కింది. కపిలతీర్థం సమీపంలో ఏర్పాటు చేసిన రెండు బోన్లలో ఒక మగ చిరుతపులి తెల్లవారుజామున పడింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా చిరుత కోసం ఫారెస్టు అధికారులు బోను ఏర్పాటు చేశారంటూ జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా చిరుతను పట్టుకోవడానికి బతుకున్న కుక్కలను వాటికి ఆహారంగా బోనులో ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
తిరుపతి కపిలేశ్వరాలయ సమీపంలో గత నాలుగు రోజులుగా తల్లి, పిల్ల చిరుతలు రెండూ సంచరిస్తున్నాయని ఫారెస్టు అధికారులకు సమాచారం రావడంతో వాటిని బంధించేందుకు ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. అటవీ శాఖాధికారులు ఏర్పాటు చేసిన బోన్లో ఉదయం మగ చిరుత పిల్ల చిక్కింది. చిరుత చిక్కిన వెంటనే దానిని తిరుపతి ఎస్వీ జూపార్కు అధికారులకు సమాచారం ఇచ్చి చిరుతను జూకు తరలించారు. 
 
ఇంతవరకు బాగానే ఉన్నా చిరుతను పట్టుకోవడానికి బతికి ఉన్న రెండు కుక్కలను వాటికి ఆహారంగా అధికారులు బోనుపై పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జంతువును పట్టుకోవడానికి మరొక జంతువును ఎలా ఎరగా వేస్తారని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments