తిరుపతి విమానాశ్రయంలో కలకలం.. ఎస్పీవై రెడ్డి బావమరిది ఏం చేశాడంటే...
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని త
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. ఎంపి ఎస్పీవై. రెడ్డి బావమరిది రామ్మోహన్ రెడ్డి తుపాకీ బుల్లెట్లతో విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ట్రూజెట్ విమానంలో వెళ్ళేందుకు విమానాశ్రయంలోకి వెళుతున్న రామ్మోహన్ రెడ్డిని తనిఖీ చేస్తే బ్యాగులో 17 రౌండ్ల 9 ఎం.ఎం. బుల్లెట్లు కనిపించాయి. దీంతో సిఐఎస్ ఎఫ్ రామ్మోహన్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. విమానాశ్రయంలో బుల్లెట్లు దొరకడం తీవ్ర సంచలనం రేపుతోంది.
ఏర్పేడు పోలీసులు రామ్మోహన్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విమానాశ్రయంలో మారణాయుధాలకు అనుమతి లేదు. రామ్మోహన్ రెడ్డి తిరుపతి-రేణిగుంట మార్గంలోని నంద్యాల పైప్స్ కంపెనీలో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. మరి ఆయన తుపాకీ బుల్లెట్లను ఎందుకు తీసుకువెళుతున్నారో తెలియరాలేదు.