ఏమయ్యా... చంద్రబాబూ, ఇలా చేశావేందయ్యా...? 'అత్త' లక్ష్మీపార్వతి

Webdunia
శనివారం, 3 నవంబరు 2018 (18:11 IST)
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి లేదు.. జయంతి లేదు. కానీ లక్ష్మీపార్వతి మాత్రం నేరుగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. మీ గౌరవాన్ని, మీ పేరును చెడగొట్టేందుకు అల్లుడు చంద్రబాబునాయుడు కంకణం కట్టుకున్నాడంటూ ఒక పేజీ లెటర్ రాసి ఘాట్ వద్ద ఉంచింది లక్ష్మీపార్వతి. గంటపాటు మౌనంగా కూర్చుండి పోయింది. ఆ తరువాత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు.
 
నైతిక విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసగించడం.. నెరవేరని హామీలివ్వడం.. వెన్నుపోట్లు పొడవడం ఇలా ఒకటేమిటి. అన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. చనిపోయిన వ్యక్తి ఆత్మ క్షోభించేలా ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసినందుకు సంతోషపడేవారని బాబు చెప్పడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది.
 
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీని చంద్రబాబు ఏ విధంగా కాంగ్రెస్‌తో స్నేహం చేస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు అలా అయిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu : శ్రీ విష్ణు, నయన సారిక జంటగా విష్ణు విన్యాసం రాబోతుంది

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ జంట గా చిత్రం ప్రారంభం

Jin: భూతనాల చెరువు నేపథ్యంగా జిన్ మూవీ సిద్దమైంది

నటిపై లైంగిక దాడి కేసు - నిర్దోషిగా మంజు వారియర్ మాజీ భర్త... న్యాయం జరగలేదు...

Bobby Simha: బాబీ సింహా, హెబ్బా పటేల్ కాంబినేషన్ లో చిత్రం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

ఉసిరి, నిమ్మకాయతో ఉప్పు.. గుండె ఆరోగ్యంతో పాటు రక్తపోటుకు చెక్

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

తర్వాతి కథనం
Show comments