Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ ఎన్నికలకే ఖర్చు పెట్టడు.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం..?: లక్ష్మీపార్వతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధిపొందేందు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (15:16 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే తీస్తుందని వస్తున్న వార్తలను లక్ష్మీపార్వతీ కొట్టిపారేశారు. జగన్ మనస్తత్వం తెలిసిన వారెవ్వరూ ఈ చిత్రాన్ని జగన్ తీయిస్తున్నాడని అనరన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అలా అనదు. 
 
ఎందుకంటే.. జగన్ ఎన్నికలకే ఖర్చుపెట్టడని.. వైకాపాలో చాలామంది బాధపడుతుంటామన్నారు. అట్లాంటిది, ఓ లక్ష్మీపార్వతి కోసం, ఎన్టీఆర్ కోసం జగన్ సినిమా తీస్తాడని చెప్పడం పచ్చి అబద్ధమని వ్యాఖ్యానించారు. అలా ఖర్చు పెట్టి వుంటే గత ఎన్నికల్లోనే గెలిచి అధికారం కైవసం చేసుకునే వాడని లక్ష్మీపార్వతి అన్నారు.
 
మరోవైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి తెదేపా మంత్రి సోమిరెడ్డికి.. ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాటల యుద్ధం జరుగుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలివితేటలు ఏమైనా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సక్సెస్‌పై చూపించమంటూ సోమిరెడ్డి చేసిన కామెంట్స్‌కు వర్మ బదులిచ్చారు. వావ్ ఏం జీనియస్ సార్ మీరు అన్నారు. సోమి సార్ చెప్పేదాకా తనకు ఆ విషయమే తట్టలేదన్నారు. సోమి టీచర్ గారు, గొప్ప పాఠం చెప్పారు. ఫీజు ఏ అడ్రస్‌కు పంపాలో చెప్పండంటూ సెటైర్ విసిరాడు. దీంతో సోమికి దిమ్మదిరిగినట్లైంది.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments