Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దివాలీ ధన్ ధనా ధన్... ఎయిర్‌టెల్‌కి దిమ్మతిరిగే షాక్... ఏంటో తెలుసా?

రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (14:00 IST)
రిలయన్స్ జియో తన ప్రత్యర్థులను లేవలేని దెబ్బలు తీసేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. జియో రూ. 1500 ఫీచర్ ఫోన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త స్మార్ట్ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అంతే జియో మళ్లీ మరో అస్త్రాన్ని సంధించింది. 
 
రూ. 399 రీచార్జ్ పైన 100 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తామనీ, దానికి 'జియో దివాలీ ధన్ ధనా ధన్' ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు దీన్ని అందిపుచ్చుకోవచ్చని వెల్లడించింది. ఇది మూడు నెలల పాటు చెల్లుబాటవుతుందనీ, రూ. 50 విలువగల 8 ఓచర్లు లభిస్తాయని తెలిపింది. 
 
ఈ కూపన్లను నవంబర్ 15 తరువాత రీచార్జ్ కూపన్లుగా వాడుకోవచ్చని పేర్కొంది. ఈ అవకాశం వినియోగదారులకు ఇవాళ్టి నుంచి దీపావళి వరకూ అందుబాటులో వుంచుతున్నట్లు వెల్లడించింది. మరి జియో దెబ్బకు ఎయిర్ టెల్ ఎలాంటి ప్లాన్ వేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments