Webdunia - Bharat's app for daily news and videos

Install App

లగడపాటి చెప్పిన సర్వే చూస్తే షాక్... జనసేనకు దిమ్మతిరుగుతుందా?

ఒకవైపు అధికార తెలుగుదేశంపార్టీ.. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో జనసేన పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆశక్తికరంగా మారింది. జనసేన పార్టీతో ఓట్లు చీలిపోతాయి. గెలుపు చాలా కష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (19:45 IST)
ఒకవైపు అధికార తెలుగుదేశంపార్టీ.. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. మధ్యలో జనసేన పార్టీ. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ఆశక్తికరంగా మారింది. జనసేన పార్టీతో ఓట్లు చీలిపోతాయి. గెలుపు చాలా కష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొంతమందైతే ఏకంగా సర్వేలు చేసి ఎవరు గెలుస్తారో కూడా చెప్పేస్తున్నారు. తాజాగా లగడపాటి చెప్పిన సర్వే చూస్తే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
ప్రధానంగా జనం కోసం పెట్టిన జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో కేవలం 6 సీట్లు మాత్రమే వస్తాయని లగడపాటి నిర్వహించిన సర్వేలో తేలింది. ఇక తెలుగుదేశం పార్టీకి 98 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 71 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తెలిపారు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. 
 
వచ్చే ఎన్నికల్లో టిడిపి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఉండటంతో ఆ పార్టీ నేతల్లో సంతోషం వ్యక్తమవుతుండగా సర్వేలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు వైసిపి నేతలు. ఈ సర్వేలతో జనసేన పార్టీ నేతల్లో నిరుత్సాహం వ్యక్తమవుతోంది. కానీ జనసేన పార్టీ ముఖ్యనేతలు మాత్రం సర్వేలను నమ్మవద్దని, వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments