చంద్రబాబుతో ఆంధ్రా ఆక్టోపస్‌‌ భేటీ ఎందుకు? రాజకీయాల్లోకి రీ ఎంట్రీ?

రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 న

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:53 IST)
రాజకీయ జోస్యాలతో ఆంధ్రా ఆక్టోపస్ అని పేరు సంపాదించుకున్న లగడపాటి రాజగోపాల్‌.. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ అయిన లగడపాటి వెలగపూడిలోని సచివాలయంలో చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల పాటు చర్చలు జరిపారు.

లగడపాటి ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వెలగపూడిలో సచివాలయం నిర్మాణం చాలా బాగుందని, తాత్కాలిక సచివాలయమే ఈ రేంజ్‌లో ఉంటే, ఇక శాశ్వత సచివాలయం ఏ స్థాయిలో నిర్మిస్తారోనని బాబుని ప్రశంసలతో ముంచెత్తారు. 
 
ఏ పార్టీకి దగ్గరైతే రాజకీయ భవిష్యత్తుకు మంచిదో సొంత సర్వే చేయించుకున్న లగడపాటి.. టీడీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కాగా తెలంగాణ ఏర్పాటు అనంతరం రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన లగడపాటి మాట నిలబెట్టుకున్నారు. కానీ లగడపాటి రాజకీయాలపై మొగ్గుచూపుతున్నారు.

మరి చంద్రబాబుతో భేటీ ద్వారా టీడీపీకి దగ్గరవుతారా? లేకుంటే బీజేపీ ప్రసన్నం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Arnold : అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీమియర్‌ చూసి అర్నాల్డ్ ష్వార్జెనెగర్ ప్రశంస

Chiranjeevi: విక్టరీ వెంకటేష్ ఎనర్గి ప్రతి క్షణం ఆనందం కలిగించింది : చిరంజీవి

ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి - వార్తలు తోసిపుచ్చలేనంటున్న 'పుష్ప' బ్యూటీ

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments