Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు"... నారా లోకేష్ బ్లండర్ మిస్టేక్ (Video)

ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్‌కు తెలుగు ప్రావీణ్యత అంతంత మాత్రమేనని తేలిపోయింది. తాజాగా మరోసారి నారా లోకేష్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (09:33 IST)
ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్‌ మళ్లీ వార్తల్లో నిలిచారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నారా లోకేష్‌కు తెలుగు ప్రావీణ్యత అంతంత మాత్రమేనని తేలిపోయింది. తాజాగా మరోసారి నారా  లోకేష్ బ్లండర్ మిస్టేక్ చేశారు. ఈ మిస్టేక్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఏమరుపాటో లేకుంటే అయోమయమో.. అసలు తెలియదో కానీ.. అంబేద్కర్ జయంతిని కాస్త వర్ధంతిగా మార్చేశారు. ఇంకా వర్ధంతి రోజున అందరికీ శుభాకాంక్షలంటూ నవ్వుతూ చెప్పారు. 
 
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగాయి. ఇందులో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడుతూ... "బాబా సాహెబ్ అంబేద్కర్ 126వ వర్థంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు" అన్నారు. కానీ జరిగేదేమో అంబేద్కర్ జయంతి. నారా లోకేష్ దాన్ని వర్థంతిగా మార్చేశారు. దీంతో పక్కనున్నవాళ్లు ఆయన్ని అప్రమత్తం చేశారు. దీంతో తప్పు తెలుసుకున్న లోకేష్ సారీ చెప్పి జయంతి శుభాకాంక్షలు అని సవరించుకున్నారు.
 
అయినా ఐటీ మంత్రి స్థానంలో ఉన్న లోకేష్ ఇలా బ్లండర్ మిస్టేక్ చేస్తే మాత్రం విపక్షానికి మరింత చులకనైపోతారని.. తప్పు దొర్లినా.. వర్థంతిని శుభాకాంక్షలు తెలపడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు విపక్ష నేతలు.. అసలు వర్థంతో.. జయంతో తెలియని వ్యక్తి.. రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments