Webdunia - Bharat's app for daily news and videos

Install App

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి గెలుపు ఖాయమట... లగడపాటి

లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేక

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (12:13 IST)
లగడపాటి రాజగోపాల్. ఎక్కడ ఎన్నికలు జరిగినా వెంటనే ఒక సర్వే చేసి ఫలితాలను ముందే చెప్పేస్తుంటారు. గతంలో కూడా ప్రధాన ఎన్నికలపై సర్వే నిర్వహించిన లగడపాటి కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశంపార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపిల సీట్లపై కూడా స్పష్టమైన సంఖ్యను కూడా ఇచ్చారు. 
 
లగడపాటి సర్వేలో వచ్చినట్లుగానే అటుఇటు రెండుమూడు సీట్లు తప్ప టిడిపి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తరువాత లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకోవడం, ఆ తరువాత ఎక్కడా రాజకీయాల గురించి మాట్లాడకపోవడం జరిగిపోయాయి.
 
కానీ తాజాగా తన స్నేహితులతో నంద్యాల ఉప ఎన్నికలపై సర్వే చేశారట లగడపాటి. ఉప ఎన్నికల్లో వైసిపి విజయం ఖాయమని తేల్చేశారట. ఇదే విషయాన్ని తన సన్నిహితుల ద్వారా అందరికీ సమాచారం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా సర్వే చేయించిన లగడపాటి ఈ నిర్ణయాన్ని ప్రకటించారట. లగడపాటి సర్వేతో టిడిపి ఆలోచనలో పడింది. 
 
ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే శిల్పామోహన్ రెడ్డి వైసిపిలోకి వెళ్ళిపోయి తన వారందరినీ లాక్కుని పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న తరుణంలో అధికారపార్టీకి పెద్ద తలనొప్పే వచ్చి పడింది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments