Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త జంటలకు సీఎం యోగి నయా గిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్... కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు...

కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న బహుమతులను అందజేయనున్నారు. ఇందుకోసం ఓ స్కీమ్‌ను ఆయన ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (10:57 IST)
కొత్తగా వివాహం చేసుకున్న వారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వినూత్న బహుమతులను అందజేయనున్నారు. ఇందుకోసం ఓ స్కీమ్‌ను ఆయన ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 'మిషన్ పరివార్ వికాస్' కార్యక్రమంలో భాగంగా ఈ కిట్లు అందజేయనుంది.
 
బహుమతి కిట్‌లో కండోమ్‌లు, ఇతర గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి. ఈ కిట్లకు 'నయీ పహల్' అనే పేరు పెట్టారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశా వర్కర్లు ఈ కిట్లను అందజేస్తారు. 
 
ఈ కిట్లలో సురక్షిత శృంగారం, ప్రసవాల మధ్య సమయం, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని అందించే బ్రోచర్లు కూడా ఉంటాయి. దీంతో పాటు కర్చీఫ్‌లు, తువ్వాళ్లు, దువ్వెన, అద్దం, నెయిల్ కట్టర్‌ను కూడా అందిస్తారు. 
 
సాధారణంగా కొత్తగా పెళ్లయిన జంటకు ఏం బహుమతి ఇవ్వాలని చాలామంది తల బద్దలుకొట్టుకుంటారు. కానీ, యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు మాత్రం ఏమాత్రం తడుముకోకుండా నయీ పహల్ కిట్లను అందజేయనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం