Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (14:22 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా ఏపీకి చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి.. తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం. 
 
వర్షిణి మెడలో అఘోరి తాళి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వర్షిణి, అఘోరి దండలు మార్చుకోవడం, తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగులు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి. 
 
ఏపీలోని నందిగామలో అఘోరికి వర్షిణికి పరిచయం ఏర్పడింది. వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం, ఆ తర్వాత వర్షిణి కుటుంబ సభ్యులు ఆహ్వానంతో అఘోరి వారి ఇంట్లో కొన్ని రోజులు గడిపింది. అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణిని కూడా అఘోరి తన వెంట తీసుకెళ్లింది. గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిణి కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిణి మళ్లీ పారిపోయి అఘోరిని కలుసుకుంది. తాజాగా అఘోరిని పెళ్లాడింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments