Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిన యూకేజీ బాలుడు మృతి.. ఎలా?

Webdunia
గురువారం, 14 నవంబరు 2019 (10:15 IST)
కర్నూలు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వేడివేడి సాంబారు పాత్రలో పడిన ఓ యూకేజీ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వరుసలో నిలబడివుండగా, వెనుక ఉన్న విద్యార్థి నెట్టివేయడంతో ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యాంసుందర్‌రెడ్డి, కల్పన అనే దంపతులకు ఆరేళ్ళ పురుషోత్తం రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఈ బాలుడు పాణ్యంలోని విజయానికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. 
 
రోజూలాగానే బుధవారం మధ్యాహ్నం పురుషోత్తం భోజనం కోసం క్యూలో నిల్చున్నాడు. ఈ క్రమంలో వెనకున్న విద్యార్థులు నెట్టివేయడంతో అదుపుతప్పిన చిన్నారి పురుషోత్తం ముందున్న పొగలు కక్కుతున్న సాంబారు పాత్రలో పడిపోయాడు.
 
ఆ తర్వాత పాఠశాల సిబ్బంది ఆ బాలుడిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే విద్యార్థి శరీరంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా విద్యార్థి సంఘాలు బుధవారం రాత్రి పాఠశాల వద్ద ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments