Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు పెళ్లైంది.. ఇక వద్దని మొత్తుకున్నా.. వినలేదు.. చంపేసింది..

మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘ

Webdunia
శుక్రవారం, 17 ఆగస్టు 2018 (11:33 IST)
మాజీ ప్రియుడే. కానీ పెళ్లై, పిల్లలు కలిగాక వివాహేతర సంబంధానికి స్వస్తి చెప్పాలనుకుంది ఆ మహిళ. అయితే మాజీ ప్రియుడి వేధింపులు అధికం కావడంతో ఇక చేసేది లేక అతడిని హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిడ్జూరు గ్రామానికి చెందిన మహిళ (42) గ్రామంలో కూలీపని చేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన గొళ్ల విజయుడుతో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఉండేది. తన కుమారుడికి, కుమార్తెకు వివాహమైందని.. ఈ సంబంధానికి స్వస్తి పలికాలని చెప్పినా అతను వినేవాడు కాదు. 
 
తన కోర్కె తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమం ఆగస్టు 14వ తేదీన రాత్రి విజయుడు ఆ మహిళ ఇంటికెళ్లిన విజయుడు.. తనతో సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవకు దిగాడు. వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది. 
 
కోపంతో ఆ మహిళ రోకలిబండతో విజయుడి తలపై కొట్టింది. అంతేకాదు కత్తితో దాడి చేసింది. ఆపై భయంతో ఇంటికి తాళం వేసి పారిపోయింది. చివరికి బుధవారం సాయంత్రం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun అల్లు అర్జున్ రాక మునుపే సంధ్యలో తొక్కిసలాట? వీడియో వైరల్

అల్లు అర్జున్‌ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఏపీ డిప్యూటీ సీఎం ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments