Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంతానం కలగలేదని.. భార్యను పుట్టింటికి పంపించి రెండో పెళ్లి చేసుకున్నాడు..

సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్

Webdunia
ఆదివారం, 19 మార్చి 2017 (18:43 IST)
సంతానం కలగడం లేదని భార్యను పుట్టింటికి పంపి రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ, కల్లప్ప దంపతులకు నలుగురు సంతానం. మూడో కుమార్తె సత్యకళను నారాయపుణపురం గ్రామానికి చెందిన వడ్డే రామాంజనేయులుకు ఇచ్చి 2002 జూన్ 16న, వివాహం చేశారు.
 
వీరిది మేనరికం కట్నం కింద కొంత బంగారం కూడా ఇచ్చారు. వీరి వివాహమై 14ఏళ్ళు గడిచినా వీరికి సంతానం కాలేదు. దీంతో మూడేళ్ళ నుండి రామాంజనేయులు భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం వేధించసాగాడు. 
 
అయితే పక్కా ప్లాన్ ప్రకారం భార్యను పుట్టింటికి పంపి.. నారాయణపురం గ్రామానికి చెందిన ఈరప్ప, పార్వతి దంపతుల కుమార్తె అనితను రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకొన్న సత్యకళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం తేవాలని, లేదా రెండో పెళ్ళికి ఒప్పుకోవాలని ఆమెను వేధించేవాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments