Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు : రీకౌంటింగ్‌లో తెదేపా అభ్యర్థి గెలుపు

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (13:54 IST)
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ పలు ఘటనలు వెలుగుచూడగా తాజాగా మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. 
 
11వ వార్డులో కేవలం 06 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి కస్తూరి విజయం సాధించారు. అయితే మళ్లీ రీ కౌంటింగ్ జరపాల్సిందేనని.. ఈసారీ తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని వైసీపీ పట్టుబట్టింది. అధికార పార్టీ డిమాండ్ మేరకు రీ కౌంటింగ్ జరిపించారు. 
 
అయితే ఈ రీ కౌంటింగ్‌లో కూడా టీడీపీ అభ్యర్థి కస్తూరి గెలుపొందారు. ఇలా వైసీపీ రెండోసారికి పట్టుబట్టి మరీ పరువు తీసుకోగా.. టీడీపీ అభ్యర్థి గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
 
కాగా.. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూస్తే వైసీపీనే ఎక్కువ స్థానాల్లో గెలిచి నిలిచింది. టీడీపీ మాత్రం ఊహించని రీతిలో సీట్లకు పరిమితం కావడం గమనార్హం. తాజాగా ఆరో వార్డు నుంచి కూడా టీడీపీ అభ్యర్థే గెలుపొందారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments