Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజా దర్బారుపై KTR వ్యాఖ్యలు.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (22:17 IST)
ప్రజా దర్బారుపై మాజీ మంత్రి కేటీఆర్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రజా దర్బార్‌ని తాము ఎందుకు నిర్వహించలేదో ఆయన సోదాహరణంగా వివరించారు. 
 
ప్రజా దర్బార్ గురించి తాము కూడా ఓ సందర్భంలో కేసీఆర్‌ని అడిగామని, ఆయన చెప్పిన సమాధానం విన్నాక ప్రజా దర్బార్ వ్యవహారంపై తమకు స్పష్టత వచ్చిందని కేటీఆర్ అన్నారు. గతంలో ఆయన ఓ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు కరెక్ట్‌గా సింక్ అయ్యేలా ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు దాన్ని తెగ వైరల్ చేస్తున్నారు. 
 
ప్రజల ముందు, మీడియా ముందు షో చేయేలానుకునేవారు మాత్రమే ప్రజా దర్బార్ నిర్వహిస్తారని, ఆ ఏర్పాట్లన్నీ షో పుటప్ అని కేసీఆర్ అన్నట్టుగా ఆ వీడియోలో తెలిపారు కేటీఆర్. ప్రజలు ముఖ్యమంత్రికి చెప్పుకునే పరిస్థితి ఉందంటే.. ఆ వ్యవస్థలోనే లోపం ఉన్నట్టు లెక్క. 
 
ఈ సమస్యలన్నీ ఎక్కడికక్కడ పరిష్కారమవ్వాలి, కింది స్థాయి అధికారులెవరూ పని చేయకపోతే అప్పుడు సీఎం దగ్గరకు రావాలి. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించడం ముఖ్యమంత్రి చేయాల్సినవి కాదు. దానికో యంత్రాంగం ఉంది. వారు ఆ పనులు పూర్తి చేయాలి... అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments