విజయవాడ: కృష్ణా పుష్కరాలను భలే షోగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతోంది. నవ్యాంధ్రకు వచ్చే అతిథులకు ఇక్కడ అంతా హైటెక్‌గా జరుగుతోందని అనిపించేలా ఏర్పాట్లకు సిద్ధమవుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా కేవలం ఆర్.అండ్ బి రోడ్ల సుందరీకరణకు 28 కోట్ల రూపాయలు కేటాయించామని ఆ శాఖ మంత్రి శిద్ధా రాఘరావు చెప్పారు. ముఖ్యంగా విజయాడ- ఏలూరు రోడ్డు, టన్నెల్ రోడ్డు, గొల్లపూడి బైపాస్ రోడ్డు, కనకదుర్గా ఫ్లయివోవర్ కడుతున్న 4 లైన్స్ రోడ్లను పుష్కర యాత్రికుల కోసం బాగుచేస్తున్నామన్నారు.
యాత్రికులు తిరిగే ప్రదేశాలన్నీ సుందరంగా ఉండేలా ఏర్పాట్లుంటాయని ఆయన చెప్పారు. పనులు ఎలా జరుగుతున్నాయో తనిఖీకి చేసేందుకు మంత్రి శిద్దా రాఘరావు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ అమరావతి నిర్మాణం కూడా జరగుతోంది... సింగపూర్, జపాన్, మలేసియా నుంచి కూడా విదేశీ ప్రతినిధులు వస్తారు... ఈ పనులన్నీ సుందరంగా జులై 15 నాటికల్లా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.