Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందివాడ మహిళా ఎస్ఐ భర్త అనుమానాస్పద మృతి!

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (09:41 IST)
కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పామర్తి శిరీష భర్త బి.అశోక్ (30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 
 
ఏలూరుకు చెందిన శిరీష గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిది కులాంతర వివాహం. ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉంది. శిరీష మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐగా పని చేస్తూ నాలుగు నెలల క్రితమే నందివాడకు బదిలీపై వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త అనుమానాస్పదంగా చనిపోవడం ఇపుడు కలకలం రేపింది. మరోవైపు, అధికార పార్టీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు మృతుని కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments