Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఛైర్మ‌న్ టీడీపీ అభ్య‌ర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబు

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:52 IST)
హైకోర్టు జోక్యంతో కొండపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఎట్ట‌కేల‌కు ప్రారంభం అయింది. ఈ ఉద‌యం ఎన్నిక‌ల‌ను పోలీసు బందోబ‌స్తుతో ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని కోర్టు సూచించ‌డంతో అంతా క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల అధికారి ఎంపీ కేశినేని నానిని ఎక్స్ అఫిషియో మెంబ‌రుగా ఛైర్మ‌న్ ఎన్నిక‌కు ఆహ్వానించారు. ఆయ‌న త‌మ పార్టీ కౌన్సిలర్లతో కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీకి చేరారు. ముందుగా కౌన్సిల‌ర్ల ప్రమాణ స్వీకారం జ‌రిగింది. అనంత‌రం ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నిక‌ల‌ను బ‌హిరంగ విధానంలో నిర్వ‌హించారు. 

 
వైసీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్ధిగా జోగి రాము, టీడీపీ తరపున ఛైర్ పర్సన్ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబు పేర్లను ప్రతిపాదించారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో స‌హా 14 మంది టీడీపీ స‌భ్యులు, ఒక ఇండిపెండెంట్ క‌లిపి 16 మంది సభ్యులు చిట్టిబాబుకు చేతులెత్తి ఓటు చేశారు. వైస్ చైర్మన్లుగా 29 వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాస్, ప‌దో వార్డు టిడిపి కౌన్సిల‌ర్ కరిమికొండ శ్రీలక్ష్మి లకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఫలితాలు ప్రకటించలేదు.
 
 
ఈ సంద‌ర్భంగా వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింద‌న్నారు. త‌మ వైసిపి సభ్యులు 15 మంది బలం ఉంద‌ని, టిడిపికి ఉన్న 16ఓటు పైనే త‌మ‌కు అభ్యంతరాలున్నాయ‌ని చెప్పారు. ఆ ఓటు చెల్లుబాటు కాదని తాము మొదటి నుంచీ చెబుతున్నామ‌ని, కోర్టు తీర్పు కూడా రేపు ఆ 16వ ఓటు చెల్లదని వ‌స్తుంద‌ని భావిస్తున్నామ‌న్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా, దానికి బాధ్యులుగా ఉంటామ‌ని ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ చెప్పారు. ఒక వేళ కోర్టు తీర్పు, ఆ ఎంపీ ఓటు చెల్లదని వస్తే, ఇక టాస్ ద్వారా కొండ‌ప‌ల్లి ఛైర్మన్ ఎంపిక జరుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

డైరెక్ట‌ర్సే నాకు గురువులు : మ్యూజిక్ డైరెక్ట‌ర్ అజ‌య్ అర‌సాడ‌

వంద రోజుల పాటు ఆలరించిన రియాలిటీ షో ... నేడు బిగ్‌బాస్ టైటిల్ ప్రకటన

ఎస్ఎస్ రాజమౌళి డ్యాన్స్ అదరహో (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments