Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక పూర్తి.. వైకాపా నుంచి జోగి రాము

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (13:51 IST)
kondapalli
కృష్ణాజిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యింది. వైకాపా నుంచి ఛైర్ పర్సన్ అభ్యర్థిగా జోగి రాము వున్నారు. టీడీపీ నుంచి చిట్టిబాబు బరిలో నిలిచారు. వైస్ ఛైర్మన్ ఎన్నికలో భాగంగా ఈ ఫలితాన్ని ఎన్నికల అధికారులు హైకోర్టుకు నివేదించనున్నారు. ఛైర్ పర్సన్ పదవి ఏ పార్టీకి దక్కిందోననే ఉత్కంఠ కొనసాగుతోంది.
 
గత రెండు రోజులుగా కొండపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక వ్యవహారం వాయిదా పడుతూ వస్తోంది. మంగళవారం టీడీపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయగా విచారణ జరిగింది. మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ నిలిపివేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కొండపల్లి మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి, విజయవాడ సీపీలు కోర్టుకు రావాలని ఆదేశించింది. బుధవారం ఎన్నిక నిర్వహించాలని.. ఆ ఫలితాలను కోర్టుకు నివేదించాలని సూచించింది. దీంతో భారీ బందోబస్తు మధ్య ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.
 
మొత్తం 29 వార్డుల్లో 14 వార్డులు వైసీపీ, 14 వార్డులు టీడీపీ గెలిస్తే ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఆ గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి లక్ష్మి టీడీపీకి మద్దతు పలికారు. దీంతో టీడీపీ బలం 15కు.. వైఎస్సార్‌సీపీ బలం 14కు చేరింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments